ORKUT

Thursday, September 10, 2009

A అంటే AIEEE, B అంటే BITSAT, .... I అంటే IIT - ఆంధ్రాలో టెక్నోస్కూల్ వ్యాపారాలు



ఒక ఇంట్లో బాధ్యత గల తల్లిదండ్రుల మధ్య సంభాషణ:


తల్లి: ఎవండీ ! పక్కింటివాళ్ళ అమ్మయిని IIT coaching లో పెట్టారట.. వింటున్నారా?..
తండ్రి: మనవాడ్ని కూడా join చేద్దాం.. ఈ సంవత్సరం 5th class అవ్వనివ్వు.. పెట్టేద్దాం..
తల్లి: ఊర్కోండీ.. ఇవాళా రేపు అంతా IIT లు EAMCET లని LKG నుంచే పెట్టెస్తుంటే..
తండ్రి: నిజమేలే.. కానీ..వాడికి పాపం ఈ school తోనే సరిపొతోంది కదా.. ఆ tuition అని, ఈ tuition అని తిప్పుతూనే ఉన్నాం.. ఇప్పుడే ఎందుకనీ..
తల్లి: ఏదైనా ఈ competitionలో ఇప్పటి నుంచీ కష్టపడనిదే రాదండీ.. రేపు వాడికి IITలో rank వచ్చాక వాడే కదా సంతోషంగా ఉండేది.. నా మాట విని వాడు ఈరోజు పడే కష్టం కన్నా.. రేపటి భవిష్యత్తు గురించి అలోచించండి.. ఏమంటారు?
తండ్రి: వాడి భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం చెప్పు మనకి..? అలాగే చేసేద్దాం..కానీ వాడు
....
...
..
.


(ఇంతలో door bell మోగింది)


"తలుపు తెరవగానే..3 కేజీల మూటని మోసీ మోయలేక ముభావంగా చూస్తున్న మున్నాగాడు.. చదివేది 5th class అయినా రోజుకి పన్నెండు గంటలు schoolల్లో, tuition నుంచి ఇంటికొచ్చాక వాడు చేసేది ఒక్కటే.. పుస్తకాలతో కుస్తీ.. అందుకే కాబోలు వాడు వాళ్ళ class topper.."


వచ్చీ రాగానే..


తండ్రి: ఏరా.. ఇవాళ maths exam ఎలా రాశావ్?
మున్న: అంతా బానే రాశాను కానీ.. last question లో 3*3=6 అని తప్పు రాశా నాన్నా..
తల్లి: (కోపంగా)ఎన్ని సార్లు చెప్పాను నీకు.. మళ్ళీ అదే తప్పు చేసుకొచ్చావ్.. ఇలా అయితే నువ్వు వంద కి వంద ఎప్పుడు తెచ్చుకుంటావ్..నీ బొంద!
మున్న: అదీ.. చూస్కోలేదమ్మా.. ఈ సారి exam బాగా చేస్తాను..
తల్లి: ప్రతి సారీ ఇంతే చెప్తావ్! ఇలాగే 10th class కూడా అయిపోతుంది.. తర్వాత నువ్వు ఇంటర్ ఎలా చేస్తావో.. IIT లో seat ఎలా తెస్తావో ఎమిటో..
మున్న: (school bag దించుతూ అమాయకంగా) అమ్మా, ఆ IAT లో కూడా HomeWorkలుంటాయా?...
తల్లి: అది అప్పటి సంగతిగానీ ముందు ఈరోజు HW చేసి తగలడు.. అన్ని తప్పులు తప్పులు చేసుకొచ్చావ్.. రేపటి exam లో సరిగా చెయ్యకపోతే చూడు.. త్వరగా స్నానం చేసిరా పో !
....
...
..
.


తల్లి: అవునండీ.. IIT అంటే ఏమిటింతకీ.. మీకా full-form ఏమైనా తెలుసా?
తండ్రి: అవన్నీ మనకెందుకు.. మనకి మనవాడి భవిష్యత్తు ముఖ్యం.. వాడికందులో seat రావడం ముఖ్యం.. అంతేనా?
తల్లి: అంతే.. అంతే.. IIT లోనే మన మున్నాగాడి భవిష్యత్తు.. :)
తండ్రి: సరేగానీ.. ఇందాకా కొత్త school పేరేంటన్నావ్?
తల్లి: ఏం school అండీ?
తండ్రి: అదే.. రొజుకి పదిహేను గంటలు చదివిస్తారన్నావు చూడు.. పారా..something
తల్లి: అదా.. పారాయణ techno school..
తండ్రి: ఆ.. అందులో పెట్టేద్దాం.. ఎమంటావ్?
తల్లి: దానికన్నా శ్రీ హిరణ్య techno school అని ఉందిగా..అది top అటండీ.. అక్కడైతే ఇరవై గంటలు చదివిస్తారట..
తండ్రి: అయితే ఇంకేం.. అక్కడే పెడదాం.. అక్కడైతేనే rank కి guarantee ఎక్కువ ఉంటుందోయ్..
తల్లి: అది నిజం.. అందులోనే join చేద్దాం....ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా.. రేపట్నుంచి ఆ పక్కింటావిడకి గర్వంగా చెప్పుకుంటాను.. మన మున్నా కూడా IIT చేస్తున్నడని..
....
...
..
.


ఇప్పుడు మున్నా లాంటి ఎంతో మంది పిల్లలకి తెలిసిన దారులు రెండే రెండు.. ఒకటి IIT(ఇంజనీరింగ్) రెండోది మెడిసిన్.. పోనీ వాళ్ళంతా ఇష్టపడే అవన్నీ చేస్తున్నారా అంటే..అది ఇప్పటి పరిస్థితుల ప్రభావమనే చెప్పాలి.. మున్నా వాళ్ళ తల్లిదండ్రులకి పాపం వాడి మీద ఉన్నది ప్రేమే..కానీ వాడి భవిష్యత్తుపై పెట్టిన ఆలోచన వాడి బాల్యన్ని ఎలా ప్రభావితం చేస్తున్నయో అలోచించట్లేదు..అహర్నిశలు కష్టపడుతున్నారు..కష్టపెడుతున్నారు..ఇంతా చేస్తే రేపు ఆ rank రావాలిగా..schoolల్లో markలు తగ్గితే ఇంక ఎవరితో మాట్లాడకపోవడం,rank రాకపోతే ఘోర పాపం చేసిన వారిలా జనసంచారానికి దూరమైపోవడం.. ఇంకా మాట్లాడితే ఆత్మహత్యలంటారు.. ఎందుకిలా?? సరే ఈలోపు మీరు ఆలోచించండి..
మనం మున్నాగాడి గురించి చూద్దాం..


ఇలా కాలచక్రం పాతిక వసంతాలు పూర్తిచేసే సమయానికి మున్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్కుంటే వాడికి ఆ rank కన్నా కోల్పోయిన బాల్యమే గుర్తొస్తుంది.. ఆ వయస్సులో ఉద్యోగానికి.. ఉద్యోగమొచ్చాక జీతానికీ ఎలాగూ కష్టపడుతూ ఉండాలి.. అప్పుడు TVలో Tom n Jerry చూసే time ఉంటుందా.. లేకపోతే రోడ్ల మీద cricket అడుకునే వీలుంటుందా.. ఎప్పుడో weekends అప్పుడు office work లేకపోతే collegues తో సినిమా కెళ్ళడం... ఇంటికి fone చేసి మాట్లాడ్డం.. అలా జీతమే జీవితంగా గడిపేయడం..


నేనేదో ఈ education system ని మొత్తం తప్పు పట్టేసి పిల్లల్నందరినీ ఉద్ధరించేద్దామనే ఉద్దేశంతో లేనిక్కడ.. అవునండీ.. ఇప్పుడు మంచి ఉద్యోగాలు సులభంగా రావాలంటే ఇంజినీరింగే చదవాలి.. చదివించండి..కానీ ఆ పసికందుల ఆసక్తులనీ, అభిప్రాయాలని కూడా గౌరవించండి..రోజుకు పన్నెండు గంటల school చదువులను స్వస్తి చెప్పండి..వాళ్ళకి చదువనేది ఉద్యోగంతో పాటు ఙ్ఞానాన్ని కూడా ఇస్తుందని తెలపండి.. అఆఇఈ లతో పాటు సరిగమలని కూడా నేర్పండి..అలా పెరిగి సంపూర్ణ భావి భారత పౌరులైన తర్వాత వారి తల్లిదండ్రులుగా అప్పుడు మీరు తప్పకుండా గర్వించదగ్గ స్థానాల్లో ఉంటారు..


ఇది నా అభిప్రాయమే కాదు.. విన్నపం కూడా..!

9 comments:

లక్ష్మి said...

అసలు మన వాళ్ళు ఉద్యోగం ఒక్కటే బ్రతికే మార్గం అన్న ఆలోచన నుండి ఎప్పటికైనా బయటపడి ఊహాశక్తీ తో ఎన్ని అద్భుతాలు చెయ్యగలరో ఆలోచించగలరా? దేశం నిండా కుప్పలు తెప్పలుగా ఇంజినీర్లే కానీ వాళ్ళల్లో కనీస అనలిటికల్ స్కిల్స్ ఉంటున్నాయా? ఏమో పిల్లలని బాల్యానికి దూరం చేస్తూ దూరపు కొండలు నునుపు అన్న రీతిలో పెట్టించే ఈ పరుగులకి ఎక్కడైనా చుక్క పFఇతే బాగుండు

raviteja said...

@లక్శ్మి..

బాగా చెప్పారు.. :)

రాహుల్ said...

బాగా రాశావు....నిజంగా ఇప్పుడు బయట అంతా చై(తన్య)నా(రాయణ) బజారు మయము......

sreenika said...

Exactly. You depicted the present scenario of state education system.
You know parents how they became...they want to see their children, how they couldn't be seen in their lives. This is very alarming situation growing leaps and bounds. God knows its fate.
The children have become tools of their aspirations. I think a lot of counseling has to be taken. Secondly the curriculum should have some lessons on career counseling so as to enable the students to choose their own career. Choice of profession should be left open to the individual. Parents and elders should stand as a guide and supporter to the children.
Good point of debate.

raviteja said...

@ రాహుల్: thanks dude ..

@ శ్రీనిక: మీరనేది అక్షరసత్యం. కానీ ఇప్పుడున్న education system మార్చాలంటే ఒక విప్లవం పుట్టించాల్సిందే.. :D

నేస్తం said...

మంచి పోయింట్ ని చాలా చక్కగా చెప్పారు

Anonymous said...

nice blog dude.. im frm Bits-G..Telugu fan like u..inspired by u.. i mau soon start a telugu blog shortly..need som info frm u .. :)btw..Teja is spreadin a lott abt ur blog..

తృష్ణ said...

well said ravi.very good post.

raviteja said...

@నేస్తం: ధన్యవాదాలు :)
@anonymous from bits-g: my doors r alwayz open 4 yer help.. n thnx alott 2 teja der.. :)
@తృష్ణ: thankyu mam :)

కూడలి