Tuesday, October 6, 2009
భాగ్యనగరంలో రెహమాన్ గళం ప్రతిధ్వనించనుంది - పండగే పండగ
దసరా అయిపోయిందే.. ఇప్పుడేం పండుగబ్బా అనుకుంటున్నారా.. దీపావళి తర్వాత హైదరాబాదులో మళ్ళీ దీపాలంకరణ జరగబోతోంది.సంగీత సామ్రాట్, సరిగమల మాంత్రికుడు, మన oscar rahman ఇవ్వనున్న jai ho live concert మహిమది.మనవంటి సంగీత ప్రియులకది షడ్రసోపేతమైన విందు.ఎటువంటి సాహిత్యానికైనా శ్రావ్యమైన గాన రూపాన్నివ్వగల దేవుడి వరాన్ని కాదనగలమా? అందుకే మనమంతా ఈ నెల ఇరవైనాలుగవ తారీఖు gmr airport arena లో సందడి చేసేద్దాం. అతని పాట ఒక అద్భుతం. అతన్ని చూడటం ఒక అదృష్టం. అసలు ఆ ఆలోచనే ఒక ఆనందం ! :P ఎదో ఆవేశం ఆపుకోలేక, ఆనందం తట్టుకోలేక రాసిన టపా ఇది.. మరిన్ని వివరాలకోసం మీరెలాగో google చేస్తారూ.. అయినా ఇప్పటి వరకూ.. వెళ్ళడం నా అలోచనే.. ఆచరణకి కావలిసిన దారుల వేటలో ఉన్నానింకా..
Posted by raviteja at 11:54 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment