ORKUT

Sunday, September 6, 2009

సహజ కవి - పోతన

ముందుగా ఒక్కసారి మనం flashback లోకి వెళ్దాం. భక్తప్రహ్లాద సినిమా :).. ప్రహ్లాదుడితో SVR: ఆ హరి మన వైరి.. అతనిని మర్చిపో నాయన ! 
ప్రహ్లాదుడు: హరి నామము ఒకసారి రుచి చూచిన మరల విడువగలమా?
"మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు" అని వాణీ జయరాం గారు ఆలకించిన పద్యంలోని పరిమళాన్ని వర్ణించడానికి మాటలే కాదు.. భాషలు చాలవు.. !!


మా నాన్నగారు ఈ సినిమా పెట్టినప్పుడల్లా పోతనామాత్యుడు రచించిన ఆ భాగవత రచనలను ఆస్వాదించడానికి ఒక జన్మ చాలదనిపిస్తుంది.చిన్నప్పుడు schoolలో తెలుగు textbookలో ఆయన పద్యాలు చదవటం చాల గుర్తు.శ్రీ కృష్ణుడి బాల్య చేష్టలను వర్ణిస్తూ ఆయన చేసిన కల్పన ఒక అద్భుతం.సరళ భాషతో సహజకవిగా భాగవత భాండాగారాన్ని రచించిన పోతన భగవాన్ సంభూతుడనడానికి నిదర్శనం ఆయని మాటలతో:
"పలికెడిది భాగవతమట
పలికిన్చెడివాడు రామభద్రుండట
పలికిన భవహరమగునట
పలికెదవేరొండు గాథపలుకగనేల"


తెలుగు భాష బ్రతికుండే వరకూ ఇటువంటి మహాత్ములు ఎప్పటికీ మహనీయులే.. వారి రచనలు ఎప్పటికీ అపూర్వ కల్పనలే !


3 comments:

Tejaswini said...

too good fashp..thanks for reminding me those wonderful poems..

తృష్ణ said...

పోతనను తలచుకున్న యువతా నీకు జోహారు..!!నాకు నమ్మకం కుదురుతోంది స్వర్ణయుగం రాబోతోందని..!!
ఇన్నాళ్ళకి చాలా లేటుగా వ్యాఖ్యలు రాస్తున్నాను.ఏమీ అనుకోకు రవి.
waiting for somemore golden posts.....!

raviteja said...

మీ అభినందనలతో నన్ను ఆశీర్వదించడమే నాకు చాలండీ :)

కూడలి