ORKUT

Wednesday, September 9, 2009

నిరీక్షణ - (కపిత)


నిదురించే నయనాలకు కనిపించే కలవు నీవు
పడిలేచే కెరటాలలొ దరిచేరే అలవు నీవు
వినిపించే సరిగమలను శృతిచేసే గళము నీవు
మదికోరే అనురాగము అందించే ప్రేమ నీవు


పురివిప్పే నెమలిని కవ్వించే వానవు నీవు
లయతప్పే ఎదసడిని సంధించిన బాణము నీవు
చలిగుప్పే మాసానికి వెచ్చని కౌగిలి నీవు
అనిచెప్పే మనసుకి నచ్చిన చెలిమి నీవు 


వెలుగిచ్చే వెలుతురును వెలిగించే కాంతివి నీవా
ఎదురొచ్చే అలజడికి బదులిచ్చే అనుభవానివా
విరబూసే విరులన్నిట మూగముద్ద బంతివి నీవా
వెంటాడే ఎడబాటును ఇకనైనా తరిగించలేవా ..


నీలి గగనాన ఎగిరే విహంగానివో
నీటి సంద్రాన ఎగసే తరంగానివో
ఏటి తామరల చందాన విరిసే
మేటి అందాల భరిణవు నీవో


8 comments:

Anonymous said...

nice one.. baundhi.. :)

బుజ్జి said...

Bagundi mithram... keep it up

సృజన said...

మీ నిరీక్షణ బాగుంది!!!

Tejaswini said...

superb.....fashp..asalu niku telugulo intha pandithyam undhani naku telidhu...kavitha ayithe awesome..i loved it a lot..wanna hear it as a song from someone..ask someone to tune it dude..

tejaswini said...

superb..niku telugu lo intha pandithyam undhani naku ippatidhaka telidhu..kavitha awesome undhi...i really loved it..wanna hear it as a song dude..try if someone would tune it..

raviteja said...

తేజు: పాండిత్యమా ఎమన్నానా? అంతా నీ అభిమానంలే . .. n yea i l b happy 2 listen yer tune den !
thnx 4 yer compli :)

తృష్ణ said...

good poetry...and its not "kapita" ..its "kavita".

raviteja said...

దాన్నేమనాలో నాకూ తెలియదులెండి.. may b i shud kip quite.. :)

కూడలి